నేడు ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు

బాధితుల పరామర్శకు నిర్ణయం

మాచర్ల, మహానాడు
ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు గురువారం ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసం నుంచి ఛలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, బోండా ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్‌, జి.వి.ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపింది.