– నిర్మాత దిల్ రాజు
ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది.తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి నేటి ( ఆగస్టు 1) నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవు. అన్నీ సమస్యలను పరిష్కరించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం..తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తాము.. అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
కరోనా కారణంగా గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, చిన్న..మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లో రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం.. అలాగే, స్టార్ హీరోల రెమ్యూనరేషన్..ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ హద్దులు దాటడం..దీంతో సినిమా బడ్జెట్ కూడా నిర్మాతలు కూడా కంట్రోల్ చేయలేని విధంగా పరిస్థితులు మారాయి.
ఇటువంటి కారణాలతో చాలా రోజులుగా నిర్మాతలు చిత్ర నిర్మాణం పరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.