ఎన్నో ఏళ్ల పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ కల సాకారం

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

మహానాడు, నందిగామ టౌన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని 1996లో జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ వేసి దేశంలోనే మొదటిసారి ఎస్‌సి వర్గీకరణపై ముందడగు వేసిందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. సామాజిక న్యాయం గెలవాలనేది టిడిపి సిద్ధాంతమని, అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేశ్‌ వెల్లడిరచారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు అండగా నిలిచారన్నారు. దళితులు ఐక్యంగా వుండి అభివృద్ధి సాధించాలని, ఆర్థికంగా సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలని ఆకాంక్షించారు.