యువతి వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధించాడు. ఆమె ఎంతచెప్పినా వినలేదు. దీంతో తండ్రికి ఈ వేధింపుల సంగతి చెప్పేసింది. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? కూతుర్ని వేధిస్తున్న ఆ పోకిరీ భరతం పట్టాడు. కత్తికో కండగా నరికాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ ఘటన వెలుగు చూసింది. షారూఖా అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు అమ్మాయి తండ్రి షరీఫ్. కూతుర్ని వేధిస్తున్న షారూఖాపై తల్వార్‌తో దాడి చేశాడు. నడి రోడ్డుపైనే కత్తితో నరికాడు. గతంలో కూతురిపై షారూఖా వేధింపుల విషయంలోనే మందలించినా వినకపోవడంతో తన ఆగ్రహాన్ని ఇలా వెళ్లగక్కాడు. షారూఖా ముఖంపై రెండు వేటులు వేశాడు. దీంతో అతడి ముఖం చిద్రమైపోయింది. వెన్నులో రెండు పోట్లు పొడిచాడు. ఇలా పలుమార్లు.. వేర్వేరు ప్రాంతాల్లో నరికాడు షరీఫ్. అనంతరం కత్తితో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం షారూఖా పరిస్థితి విషమంగా ఉంది.