బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్
గుంటూరు, మహానాడు : ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు సాంఘిక సమన్యాయం చేసిందన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమై దేశంలో కులాల మధ్య అసమానతలు కలగజేశారని అన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చారని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జోనల్ ఇన్చార్జి తానుచింతల అనిల్ కుమార్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కో- ఆర్డినేటర్ దొడ్డ జార్జి, బీజేపీ జిల్లా కార్యదర్శి కత్తి మేరీ సరోజిని, మేకల లక్ష్మణ్, స్టాలిన్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆవుల రామ కోటేశ్వరరావు, పద్మనాభం, దుర్గ బాబు, సాంబిరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు