వాసిరెడ్డి సునీత, కృష్ణారావుల హత్య బంగారం కోసం జరిగింది కాదు

-జంట హత్యల వెనుక మరేదో మర్మం దాగి ఉంది…
-దొంగలు వచ్చి వారి గొంతు కోశారని హరికథలు చెప్పద్దు…
-పోలీసువారి నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి కేసును పరిష్కరించండి..
-సునీత జూన్ నెలలో నాకు ఫోన్ చేసి, స్థానికంగా సమస్యలు ఉన్నాయని తెలిపారు…
-జంట హత్యల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి, దోషులను శిక్షించండి…
-నెల్లూరులో పరిస్థితులు చూస్తుంటే మతిపోతుంది, రోజుకోచోట హత్యలు జరుగుతున్నాయి.
-నెల్లూరు లో అశాంతి వాతావరణం నెలకొంది..
-పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి, రోజురోజుకీ బలహీనపడుతోంది…
-రాజకీయ నాయకులు స్టేషన్ లోకి వచ్చి మా మనుషులను ఏమి చేయలేరు అన్నారంటే…
-పోలీసులు ఖాకీ దుస్తులు వేసుకోవడం అనవసరం… వ్యవస్థ కూడా ఉండడం అనవసరం..
– నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్. అబ్దుల్ అజీజ్

నెల్లూరు రూరల్ పరిధిలోని, పడారుపల్లి అశోక్ నగర్ లో దారుణ హత్యకు గురైన భార్య భర్తలు వాసిరెడ్డి సునీత, కృష్ణా రావుల మృతదేహాలను ఆదివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లోని మార్చురీలో పరిశీలించారు..
పరిశీలించిన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ…నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దారుణం జరిగిందని, భార్య భర్తలు వాసిరెడ్డి సునీత, వాసిరెడ్డి కృష్ణా రావు ఇద్దరినీ అతి క్రూరంగా చంపేశారని అన్నారు…వీరు కృష్ణా జిల్లాకు సంబంధించిన వారిని 30 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లాకు వచ్చి స్థిరపడ్డారని కరెంట్ ఆఫీస్ సెంటర్లో శ్రీరామ క్యాంటీన్ పేరుతో వ్యాపారం చేస్తూ, జీవనం సాగిస్తున్నారని, వీరు ఎంతో వినయపూర్వకమైన మనుషులని తెలిపారు.

వాసిరెడ్డి సునీతకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం అని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తమ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు..వాసిరెడ్డి సునీత హౌస్ వైఫ్ అని ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారని ఎవరైనా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఆమె స్థాయిలో తిరిగి ప్రతి విమర్శ చేసి దానిని ఖండించే వారని తెలిపారు.

నెల్లూరులో పరిస్థితులు చూస్తుంటే మతిపోతుందని రోజూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయనీ, ముఖ్యంగా యువత గంజాయి, సొల్యూషన్లకు అలవాటు పడి మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు..పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని రోజు రోజుకి బలహీనపడుతుందని జిల్లా ఎస్పీ విజయరావు వచ్చినప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు.

జిల్లా ఎస్పీ ప్రజలకు దైర్యం కల్పించాలని, ప్రజలకు ధైర్యం కలిగేలా జిల్లా ఎస్పీ వ్యవహరించాలని సూచించారు..పోలీసు వ్యవస్థ ప్రజలకు విశ్వాసం కల్పించాలని ఆడబిడ్డలో అర్ధరాత్రి వరకు పనులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని వాటిని గమనించాలని నగరంలో అశాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. వాసిరెడ్డి సునీత దంపతుల హత్య బంగారం కోసమో మరొక దానికోసం జరిగిన హత్య కాదని, దీనిలో ఇంకేదో మర్మం దాగి ఉందని తెలిపారు…పోలీసు వారు ఇదేదో బంగారం కోసం జరిగిన హత్య అని చిత్రీకరించవద్దని ఇది ప్రొఫెషనల్ కిల్లర్లు చేసిన హత్య అని ప్రొఫెషనల్ కిల్లర్ లను నియమించి చేసిందని అన్నారు.

వాసిరెడ్డి సునీత జూన్ నెలలో తనకు ఫోన్ చేసి ఇంటి దగ్గర అమేకు సమస్య ఉన్నట్లు రోడ్ నిర్మాణం డ్రైన్ హోల్, కరెంట్ పోల్ అన్ని తన ఇంటి దగ్గర పెడుతున్నట్లు తెలిపారు…పోలీసు వారు దీనిని బంగారం కోసం జరిగిన హత్య కింద పరిగణించకుండా, వివిధ కోణాల్లో దీన్ని పరిశీలించాలని దీని వెనుక కుట్ర లేకపోతే భార్య భర్త ఇద్దరినీ ఇంత కిరాతకంగా చంపి పోవాల్సిన అవసరం లేదని అన్నారు..
భర్త బయట చనిపోయి ఉన్నారని, భార్య లోపల చనిపోయి ఉన్నారని, ముందు భార్యను చంపేసి, భర్త వచ్చే వరకు వేచి ఉండి చంపేసి వెళ్లిపోయారని, అన్నారు…ఇద్దరినీ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు గా చంపారంటే, ఇది పథకం ప్రకారం జరిగిందని అన్నారు..

పోలీసు వారు తమకు ఉన్న నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి ఈ కేసు ను పరిష్కరించాలని, దీని వెనుక ఉన్న దోషులను, కుట్రదారులను బయటకు తీయాలని డిమాండ్ చేశారు..దొంగలు వచ్చి గొంతు కోసేసి వెళ్ళిపోయారు అని హరికథలు చెప్పొద్దని, సరైన రీతిలో దీనిని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని, వీటిని అన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ పై ఉందని హితవు పలికారు.ఇటీవల కాలంలో, రాజకీయ నాయకులు స్టేషన్లోకి వచ్చే వారి మనుషులని బయటకు తీసుకువచ్చి మీరు ఏమి చేయలేరని అనే పరిస్థితులు వచ్చాయంటే, పోలీసు వారు ఆ యూనిఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ కూడా కూడా అవసరం లేదని అన్నారు… ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది కాబట్టి ప్రజలకు ధైర్యం కల్పించి గౌరవ మర్యాదలను కాపాడుకోవాలని హితవు పలికారు.

రాజానాయుడు, పెంచల నాయుడు, జలదంకి.సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి.గంగాధర్, ఈదర.శ్రీనివాసులు, సుబ్బరాజు, శ్రీనాద్, చెంచయ్య, రఘురామయ్య, పూడి.ఆనంద్, ఇశ్రాయేలు, వడ్లమూడి.రమేష్, సత్తార్, నారాయణ, సాజిద్, మారుతి, శాంతినాయుడు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..