Mahanaadu-Logo-PNG-Large

టాలావుడ్‌ డ్రగ్స్‌ కలకలం…ప్రస్తుతం మరో కీలక మలుపు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో.. పలువురు టాలీవుడ్ ప్రముఖులపై 2017లో నమోదైన కేసులను కోర్డు కొట్టేసింది. అయితే.. టాలీవుడ్‌ నటులే టార్గెట్‌గా ఎక్సైజ్‌ కేసులు నమోదవగా.. ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. 8 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే.. ఈ 8 కేసుల్లో న్యాయస్థానం ఆరు కేసులను కొట్టివేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్‌ ఫాలో కాలేదని ఎక్సైజ్ శాఖపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే.. ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులను అధికారులు నెలల తరబడి వివరించారు. విచారణే కాకుండా.. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల శాంపిళ్లు కూడా తీసుకున్నారు. ఆ శాంపిళ్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. అయితే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్‌ శాంపిల్స్‌ మాత్రమే పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌.. వాళ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్‌ఎఎస్‌ఎల్‌ తేల్చింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఎక్సైజ్ శాఖ తరపున బలమైన సాక్ష్యాలు లేకపోవటంతో ఆరు కేసులను కొట్టేస్తున్నట్టు తీర్పును వెలువరించింది.

2018లో ఎక్సైజ్ శాఖ 8 కేసులను నమోదు చేసింది. ఇందులో ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది. పలువురి నటుల నుంచి గోళ్లు, వెంట్రుకలను కూడా సేకరించారు. వారి నుంచి తీసుకున్న శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన ఈ కేసులో 12 మంది పేర్లు ఉన్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ తో పాటు పలువురు ఇందులో ఉన్నారు. పూరీ జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన శాంపిల్లల్లో ఎలాంటి డ్రగ్స్ అనావాళ్లు లేనట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికల్లో వెల్లడైనట్లు తేలింది. వీటితో పాటు పలు సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… ఆరు కేసులను కొట్టివేసింది. మరో రెండు కేసుల్లో విచారణ జరుగుతోంది.

డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ పాటించలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వారి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీనటులు రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్, పూరీ జగన్నాథ్, చార్మి, నవదీప్, నందు, ముబైత్ ఖాన్, తదితరులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

పరారీలో డైరెక్టర్ క్రిష్‌..
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు తెలిపారు పోలీసులు. క్రిష్ కోసం వెతుకుతున్న పోలీసులు.. అతనిపై 160 సిఆర్‌పిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు చెప్పారు. ఈ కేసులో వివేక్‌ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌, డ్రగ్స్ సప్లయర్ మీర్జా వహిద్‌ బేగ్‌లను వరుసగా 11, 12 నిందితులుగా చేర్చారు పోలీసులు. వివేక్ ఏడాది క్రితమే డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధీలతో కలిసి వివేక్ డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిషి, నీల్‌తో పాటు క్రిష్‌ కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు తెలిపారు పోలీసులు. క్రిష్ కోసం వెతుకుతున్న పోలీసులు.. అతనిపై 160 CRPC సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు చెప్పారు. ఈ కేసులో వివేక్‌ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌, డ్రగ్స్ సప్లయర్ మీర్జా వహిద్‌ బేగ్‌లను వరుసగా 11, 12 నిందితులుగా చేర్చారు పోలీసులు. వివేక్ ఏడాది క్రితమే డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధీలతో కలిసి వివేక్ డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిషి, నీల్‌తో పాటు క్రిష్‌ కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించారు.