చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “తంగలాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీన “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. “తంగలాన్” సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. “తంగలాన్” ట్రైలర్ పై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.