ఉగాది స్పెషల్… సినిమాల్లో కొందరు.. ఎన్నికల ప్రచారంలో మరికొందరు

‘ఉగాది’ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని! ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. టాలీవుడ్‌ ఉగాది పండుగ. తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడే. ఈ ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సంప్రదాయంతో పాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ, వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఇక ఈ కొత్త ఆశలతో ఎంతో ఆనందంగా మన తెలుగు స్టార్స్‌ అందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. టాలీవుడ్‌ స్టార్స్‌కు కాస్త సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి దాంతో కొత్త తమ తమ కొత్త చిత్రాలన్నీ కూడా నూతన సంవత్సరం రోజున ప్రారంభించాలని అదే రోజు క్లాప్‌..పూజాకార్యక్రమాలు… కెమెరాస్వచ్చాన్‌లు పెట్టుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం మన టాలీవుడ్‌ హీరోలు… హీరోయిన్లు ఈ పండుగకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఓ సారి చూసేద్దాం…

మెగాస్టార్‌ చిరంజీవి… మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే భారీ సెట్స్ వేసి షూటింగ్స్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా విశ్వంభర షూట్ అప్‌డేట్ వచ్చింది. విశ్వంభర మూవీ షూట్ఏప్రిల్2 నుంచి 19 వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరగనుంది. ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని సమాచారం.

విక్టరీ వెంకటేష్‌… ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉన్నారు. అనిల్‌రావిపూడితో మరో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది సెట్స్‌ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

అక్కినేని నాగార్జున… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే కుబేర సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్ ఓ బిచ్చగాడిలా కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్ గా మారింది. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా వరకు లవ్ స్టోరీలు, మంచి రామ్ కామ్ లు ఉంటాయి. కానీ మొదటిసారి తన జానర్ కి భిన్నంగా ఈ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ….. దర్శకుడు బాబీతో నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్యని చూపించినంత వైలెంట్ గా ఈ సినిమాలో చూపిస్తానంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఆ మాటలకు తగట్టలే ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యాక్షన్ తో అదుర్స్ అనిపించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీ టైటిల్ ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఎన్‌బికె109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ను పట్టాలెల్లించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు క్రిష్ , హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు కమిట్ అయ్యాయి ఉన్నాడు పవన్. దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఆగిపోయింది. ఆంధ్రాలో ఎన్నికలు అయ్యాక ఆ సినిమా షూటింగ్ చేద్దామని చెప్పడంతో ఇప్పుడు హరీష్ శంకర్ వేరే సినిమా చేస్తున్నాడు. పవన్‌ ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండూ బ్యాలెన్సింగ్‌గా మ్యానేజ్‌ చేసుకుంటూ వస్తున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌…ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. . ఇక దేవర సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. శ్రీకాంత్, షైన్ చామ్ టాకో.. పలువురు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దేవర సినిమా సముద్రం ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్రపు దొంగల కథాంశంతో ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే దేవర షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. గోవా, గోకర్ణ, రామోజీ ఫిలిం సిటీ.. వంటి ప్లేస్ లలో షూటింగ్ చేశాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

రామ్‌చరణ్‌…రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర దర్శకత్వంలో మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి ఒక్క టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో చరణ్ అభిమానులు శంకర్ పై, దిల్ రాజు పై కోపంగా ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా గేమ్ ఛేంజర్ యూనిట్ కే క్లారిటీ లేదు. ఈ సినిమా పనుల్లో ఉంటూ కాస్త విరామ సమయం దొరకడంతో చరణ్‌ ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌ వెళ్ళి రిలాక్స్‌ అయి ఇటీవలె తిరిగి వచ్చారు.

రవితేజ…ఫిబ్రవరి 9న మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. సినిమాకు మంచి టాక్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగానే కలెక్ట్ అయ్యాయి. ‘మిస్టర్ బచ్చన్’ డిఫరెంట్ సినిమా ప్రస్తుతం ఆయన ఆ చిత్ర షూటింగ్‌ బిజీలో ఉన్నారు.

ప్రభాస్‌… ప్రభాస్ చేస్తోన్న ప్రతి సినిమా ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఏళ్లకు ఏళ్లు సాగుతున్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘కల్కి 2898 ఎడి’ మూవీ కూడా ముందుగా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రభాస్‌ ఇటు కల్కి సినిమా రిలీజ్‌ హడావిడిలో ఉంటూనే మరో పక్క దర్శకుడు హనురావిపూడితో మరో సినిమాకి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.