కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి “పురుషోత్తముడు” మూవీ టీజర్ లాంఛ్. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ డా. రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి అన్నారు.