రాష్ట్ర అభివృద్ధికై ఇక నుండీ పోరాడుదాం
కలిసి పని చేద్దాం,నమ్మి ఓట్లేసిన ప్రజల ఆశయాలు నెరవేరుద్దాం
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు
అమరావతి,మహానాడు: కష్టమైనా, నష్టమైనా పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చించారు.ఐదున్నర ఏళ్లుగా చేసిన పోరాటానికి ఈ రోజు ఫలితం వచ్చిందని తెలిపారు.
ఇక నుండి అందరం కలిసి ముందుకు వెళ్దామని,ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతకైనా పోరాడేందుకు సిధ్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి సహకారం అవసరమన్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధిలో నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా మార్చేందుకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ ను డా.చదలవాడ కోరారు.