ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – విరాజి కథ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను. సెకండాఫ్ కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుందని హర్ష కు చెప్పాను. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా. మా డైరెక్టర్ హర్ష కు ఇది మొదటి సినిమా కానీ ఆయన చేయబోయే చాలా సినిమాలకు ఇది మొదటి సినిమా. హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మీరు చూడగానే సర్ ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను విరాజి మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ మహేంద్ర నాకు బ్రదర్ లాంటి వారు. ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విరాజి సినిమాకు పనిచేసిన వారంతా ప్యాషన్ తో వర్క్ చేశారు. మా సినిమా కు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.