మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ టైటిల్ టీజర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులని అలరించారు. టైటిల్ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర బృందం 13 మ్యాసీవ్ సెట్లను నిర్మించి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేశారు. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. ఈరోజు చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఈరోజు షూటింగ్లో మెగాస్టార్ జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. టీం విడుదల చేసిన క్రియేటివ్‌లో చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు చూపిస్తుంది. ఇది చాలా క్రియేటివ్, మెస్మరైజింగ్ గా వుంది.
బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్లీయస్ట్ చిత్రంగా నిలుస్తోంది.
ఈ సినిమా సాంకేతికంగా చాలా గ్రాండీయర్, విజువల్ వండర్ గా ఉండబోతుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్లుగా ఉన్నారు.