ప్రపంచానికి మార్గదర్శి స్వామి వివేకానంద – తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

 స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఎన్‌టిఆర్‌ భవన్‌లో జరిగింది. స్వామి వివేకానందుడు విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన తరువాత మన ప్రజల కష్ట, సుఖాలు, జీవన విధానము, ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కాలినడకన పాదయాత్ర చేశారు. కొన్ని చోట్ల ఎద్దులబండిపై వెళ్లారు. ఈ పాదయాత్రలో కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉండవలసి రావడంతోపాటు రాత్రి సమయాల్లో ఉండటానికి వసతి కూడా లేకపోయింది.
స్వామిజీ గారు పాదయాత్ర అనంతరం భారతదేశం బాగు పడాలంటే ఈ క్రింద రచించిన అంశాలపై శ్రద్ధ వహించాలని అన్నారు. అవి 1. దారిద్య్రంను రూపుమాపడం, 2. కులం, 3. స్త్రీ స్వాతంత్య్రం, 4. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకోవడం, 5. విద్యా విధానంలో లోపాలు సరిచేయడం.
స్వామిజీ భారతదేశం పురోభివృద్ధికి  చూయించిన పై అంశాలను తెలుగుదేశం పూర్తి చేసింది.  నందమూరి తారక రామారావు దేశంలో మొదటిసారి దళితులకు ఆశ్రమ పాఠశాలలను 46 ఇవ్వగా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తం చేశారు.
ఎన్‌.టి.ఆర్‌ స్త్రీలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కల్పించగా,  చంద్రబాబు నాయుడు మహిళలకు ఐదు లక్షల సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించారు.
అంటరానితనం నిర్మూలనా కార్యక్రమం మెదక్‌ జిల్లా, పెద్దిరెడ్డిపేటలో ప్రారంభించి దళితుల పిల్లలకు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఎస్సీ కమిషన్‌ను వేశారు చంద్రబాబు.
అందరికీ విద్య అందించే విషయంపై విజన్‌ 2020లో భాగంగా చదువుల పండుగ చట్టం చేసి, అక్షర కిరణం, మళ్లీ బడికి పథకం, అక్షర సంక్రాంతి వంటి కార్యక్రమాలను అమలు చేశారు చంద్రబాబు .
చంద్రబాబు నాయుడు  అణగారిన వర్గాల కొరకు జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, మలుపు పథకం ద్వారా, దళితులకు చైతన్యం పథకం ద్వారా గిరిజనులకు, వెనుకబడిన వర్గాల కొరకు ఆదరణ పథకాల ద్వారా అభివృద్ధి చేశారు.
వివేకానందుని జన్మదినం సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి  కార్యక్రమాలను ఎన్‌టిఆర్‌ భవన్‌లో చిత్ర పటాల ద్వారా నాయకులకు, కార్యకర్తలకు ప్రజంటేషన్‌ ఇవ్వడం జరిగింది.