మార్కెటింగ్ శాఖ కమిషనర్ యం.విజయ సునీత
మహానాడు, తెనాలి: తెనాలిలోని మార్కెట్ యార్డును వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత శుక్రవారం పరిశీలించారు. నిమ్మ రైతులతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, లైటింగ్, పలు సమస్యలు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ చర్చించారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మార్కెట్ యార్డ్‌ను రైతులకు ప్రయోజనం కరంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు.