-ఏపీలో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు
– ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే మీకెందుకు కడుపుమంట?
– ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఇంత బానిసత్వం అవసరమా?
– తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పవన్ కల్యాణ్ సంసారం
పాలకొండలో మీడియాతో మాట్లాడిన పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
మంత్రి అప్పలరాజు ఇంకా మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్, రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రడు పవన్ కల్యాణ్ అడ్రస్ హైదరాబాద్.. వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి మనం ఎక్కడ ఉండాలో నిర్దేశిస్తారు.. మన రాష్ట్రం గురించి అడ్డగోలు రాతలు రాస్తారు. అసలు వీళ్ళల్లో ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు ఉందా? వీళ్లు మనం ఎక్కడ నుంచి పరిపాలన చేయాలో చెప్తారు
ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులకు ఇంత బానిసత్వం అవసరమా? ఇంత బానిస బతుకు అవసరమా? అచ్చెన్నాయుడు ఇంత బతుకు బతికి.. చివరికి బానిస బతుకు బతుకుతున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని వారు అమరావతిలోనే కార్యాలయాలు ఉండాలని చెప్తూ ఉంటే.. మీరు వాళ్ళకు బాకాలు ఊదుతూ, వాళ్ళ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారంటే, విశాఖ పనికిరాదని మాట్లాడుతున్నారంటే.. మీకు రాజకీయ అవకాశాలు ఇచ్చి పెద్ద పెద్ద నాయకుల్ని చేసిన ఈ ప్రాంతానికి మీరు చేస్తున్నది ఏంటి? అచ్చెన్నాయుడు ఆస్తులూ ఇక్కడే ఉన్నాయి కదా…
విశాఖకు పరిపాలన వ్యవస్థ వస్తే ప్రజలకు మంచి జరుగుతోంది, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయి, ఉద్యోగ, విద్యా అవకాశాలు పెరుగుతాయి, మన ప్రాంత పిల్లలకు ఇక్కడే ఉపాధి కలుగుతోంది. మన ప్రాంత ప్రజల ఆస్తులకు విలువ పెరుగుతోంది. అత్యంత ప్రాధాన్యమైనటువంటి విశాఖను ఆనుకుని ఉన్న అనకాపల్లి, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎక్కడెక్కడకో వెళ్ళిపోతున్నారుగా… మీ కొడుకు రామ్మోహన్ నాయుడు వారానికి ఒకసారి విదేశాంగ శాఖకు మావాళ్లు అరబ్ దేశాల్లో, సింగపూర్, మలేషియా, ఆఫ్రికాలో చిక్కుకుపోయారని లెటర్లు రాస్తారు.. వాళ్ళందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా.. అటువంటి అవకాశాలు కల్పించాలంటే రాజకీయ నిర్ణయం జరగాలి.
అలాంటి గొప్ప రాజకీయ నిర్ణయం జరగకుంటే.. ఉత్తరాంధ్రను ఇతర జిల్లాలతో ఎలా పోటీలో నిలపగలుగుతాం? ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇతర జిల్లాల ప్రజలతో పోటీపడగల్గుతారు? సాంకేతికంగా, ఇండెక్స్ పరంగా ఇతర ప్రాంతాలతో ఇంకెప్పుడు సరితూగగలుగుతాం..? ఏమన్నా అంటే పిచ్చిమాటలు మాట్లాడతారు.. మీరు చేసిన అభివృద్ది పనులు ఏంటని ప్రశ్నిస్తారు.. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు మొదలయ్యాయి కళ్ళు కనిపించట్లేదా? మూలపేట పోర్టు పనులు జరుగుతున్నాయి కళ్ళు మూసుకుపోయాయా? అన్ని అభివృద్ది కార్యక్రమాలు జగన్ గారి హాయాంలోనే ప్రారంభమయ్యాయి
మాట్లాడితే ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి అంటారు.. చంద్రబాబు విజనరీ అయితే విశాఖ ఇప్పటికే ఐటీ క్యాపిటల్ అవ్వాలిగా? నిజానికి విశాఖలో ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చింది దివంగత మహనేత డా.వైయస్. రాజశేఖర్ రెడ్డి . ఐటీ ఎస్ఈజెడ్ మంజూరు చేసింది వైయస్ఆర్ గారు, ఐటీ విల్ ఇచ్చింది, సత్యం, విప్రోకు స్థలాలు ఇచ్చింది వైయస్ఆర్ .. అసలు మీరు చేసింది ఏంటి? పొడిచింది ఏంటి?
వీటన్నింటినీ జగన్ కొనసాగిస్తున్నారు, ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది, అదానీ క్యాంపస్ వస్తుంది.. పెద్దఎత్తున ఇండస్ట్రీస్ గ్రౌండ్ అవుతున్నాయి. మీలా తప్పుడు ఒప్పందాలు, ఎంవోయూలు చేసుకోలేదు. మీలా మేము వాచ్ మెన్ లతో , ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో ఎంవోయూలు చేసుకోలేదు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదానీ, అంబానీలాంటి బిగ్ షాట్స్ విశాఖకు వచ్చారు.
ఉత్తరాంధ్రకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, కళ్ళముందు అన్నాన్ని లాగేసుకునే పరిస్థితి రావొద్దు, అదే పరిస్థితి వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా ఉద్యమబాట పడతారు, మీ సంగతలు తేలుస్తారు. పవన్ కల్యాణ్.. తెలంగాణ విడిపోవడానికి కారణం వైయస్ఆర్ అని, జలయజ్ఞం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. అసలు వేరే రాష్ట్రంలో నీ పార్టీ ఉందని నమ్మితే, నువ్వు నాయకుడివి అని నమ్మితే.. ఆ రాష్ట్రం గురించి, అక్కడ పరిపాలన గురించి, ఆ రాష్ట్ర నాయకులు గురించి మాట్లాడు.. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడటం నిజంగా చాలా నీచం, ఆశ్చర్యం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం వీళ్లందరూ.. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజార్చేలా ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారతారా?
అసలు పవన్ కల్యాణ్ కు ఉన్న ఐడియాలజీ ఏంటి? కాన్సప్ట్ ఏంటి? తెలంగాణలో బీజేపీతో, ఆంధ్రాలో టీడీపీతో అలయెన్సా? టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ తో అలయెన్సా? ఇక్కడేమో బీజేపీతో అలయెన్స్ కు ప్రయత్నం చేస్తారా? దేశంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? కేవలం చంద్రబాబుకు ఉన్న దిగజారుడు విలువల వల్లే ఇటువంటి రాజకీయం.
తెలంగాణలో బీజేపీతో పవన్ కల్యాణ్ కలిసి వెళ్ళాడు.. అక్కడ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. కాంగ్రెస్ తో టీడీపీవాళ్ళు ఓపెన్ గా సపోర్టు చేసి ప్రచారంలో తిరుగుతుంటే.. ఏపీకి వచ్చేసరికి పవన్ కల్యాణ్ టీడీపీతో అలయెన్స్.. ఓ వైపు బీజేపీతో అలయెన్స్.. చంద్రబాబు మళ్లీ బీజేపీతో అలయెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక సంసారం అంటే విలువులు ఉండాలి కదా..
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఎలా ఉన్నాడో ..నిజ జీవితంలో కూడా అలానే ఉన్నాడు.. అంటే అది ఆయన మనస్తత్వం, అటిట్యూడ్ మేటర్స్… విలువులు లేనితనం వంటపట్టింది అంటే అన్నిట్లోనే అదే చూపిస్తాం… నిజ జీవితంలో ఎలా విలువులు కోల్పోయి చేస్తున్నావో.. రాజకీయాల్లో కూడా అలానే చేస్తున్నావు.. ప్రజలందరూ నిలదీయాలి.
లోకేష్ పనికిమాలినవాడు, అవగాహన లేకుండా మాట్లాడతాడు.. మిలీనియం టవర్స్ ప్రభుత్వ భవనం.. ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడానికి జీవో ఇచ్చారు.. రాష్ట్రానికి ఏ కంపెనీ వచ్చినా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చి గ్రౌండ్ చేయిస్తున్నాము.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్నాము.. ఎవడో పనికిమాలిన వాడు ట్వీట్ చేశాడని ఆలోచించకూడదు..
ప్రాంతాల సమతుల్యత మీద అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు అవి
చంద్రబాబు సీఎంగా పనిచేసినప్పుడు రాజధాని అమరావతి అని డిక్లేర్ చేసి ఎక్కడ ఉన్నాడు.. హైదరాబాద్ హోటల్ ఉండి దాన్నే అధికారికంగా నివాసంగా చూపించాడు. ఆరోజు ఈ రూల్స్, రెగ్యులేషన్స్ లేవా? జగన్ విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి ఉంటానంటే తప్పేంటి.. సీఎంవో అనేది ఫలానా చోట ఉండాలని రూల్ లేదు.. ఆయన ఎక్కడ ఉంటే అదే కార్యాలయం.. ఫస్ట్ వీక్ నుంచి సీఎంగారు విశాఖలో అందుబాటులో ఉండబోతున్నారు.