ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరించడమేమిటి?

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.
 ఒకవేళ అంగన్ వాడీలను ఉద్యోగాలనుంచి తొలగించినా ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మరో 3నెలల్లో టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా వారిని తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తుందని హామీ ఇస్తూ… అంగన్ వాడీల  పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్నాను.