జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా పోరాడుదాం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు నాయుడు తో పాటు, అనేక మందిపై తప్పుడు కేసులను బనాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా పోరాడుదామని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… స్కిల్ కేసు లో ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ, సుప్రీం కోర్టులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ జడ్జి అనిరుద్ బోస్ విడిగా తీర్పును వెలువరిస్తూ… అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ఈ కేసుకు వర్తిస్తుందని చెప్పారన్నారు.
రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా ఎటువంటి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. జూనియర్ జడ్జి బేలా త్రివేది, సీనియర్ జడ్జి తీర్పును విభేదించారు. 2018 జూన్ లో అవినీతి నిరోధక చట్ట సవరణ అనంతరం నమోదు చేసిన కేసులకు మాత్రమే , చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని చెప్పారు. అంతకంటే ముందు కేసు నమోదు చేస్తే, ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నారు.
ఇదే విషయమై, గతంలో చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తేదీ, సమయం ప్రాతిపదికగా అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ఈ కేసుకు వర్తిస్తుందన్నారు.. అవినీతి నిరోధక చట్ట సవరణ అనంతరం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన కేసులకు 17A నిబంధన వర్తిస్తుందని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉందని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
స్కిల్ కేసు ఎఫ్ ఐ ఆర్ క్వాష్ పిటిషన్ పై సీనియర్ జడ్జి తీర్పు అనుకూలంగా ఉండడం, జూనియర్ జడ్జి తీర్పు అన అనుకూలంగా ఉండడంతో, ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. ఈ కేసు లో వాదనలను వినడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఎంత శరవేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు, అనంతరం ఇరు పక్షాల వాదనలు వినడానికి కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులలో ఆయనకు బెయిల్ లభించింది. రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం కూడా స్కిల్ కేసు ఎఫ్ ఐ ఆర్ క్వాష్ పిటిషన్ పై అనుకూలంగానే తీర్పును ఇస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. బొబ్బిలి పులి సినిమాలో కథానాయకుడు ఎన్టీ రామారావు కోర్టు కోర్టు తీర్పు మారుతుందని డైలాగు చెప్పడం చూశాం.
కానీ ఒకే కోర్టులో ఒక జడ్జి ఒక రకమైన తీర్పు, ఇంకొక జడ్జి ఇంకొక రకమైన తీర్పును చెప్పాల్సిన పరిస్థితి నెలకొనడం, మనకు వినాల్సి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ కేసు లో ఎఫ్ఐఆర్ క్వాష్ పిటీషన్ పై సీనియర్ న్యాయమూర్తి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ద్వారా, భవిష్యత్తులోనూ ఇదే తీర్పు పునరావృత్తమవుతుందన్న ఆశా భావాన్ని వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, రానున్న ఎన్నికలకు హుషారుగా వెళ్దామని పిలుపునిచ్చారు.
ఈ తీర్పుపై చంద్రబాబు నాయుడు అభిమానులు, రాజ్యాంగాన్ని గౌరవించే వారికి ఎటువంటి అనుమానాలు అక్కరలేదన్నారు. కొంచెం కూడా అధైర్య పడాల్సిన పరిస్థితి లేదన్న ఆయన, అవసరమైతే సంబరాలను కూడా చేసుకున్న తప్పు లేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్ లో ఉండడం వల్ల, ఈ కేసులో స్టేటస్కో కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు.