• ఆ పత్రిక, సాక్షి టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్ట…
• ప్రజలారా… ఆ రాతలు, ఆ మాటలు నమ్మకండి
– మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి, మహానాడు: సాక్షి పత్రిక, టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్టని, అవి ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని.. సాక్షిలో వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
వర్ల రామయ్య మాట్లాడుతూ..
చట్టాన్ని అతిక్రమించి జగన్ మెప్పుకోసం జుడీషియల్ కస్టడీ ఉన్న నాటి ఎంపీ రఘురామను దారుణంగా టార్చర్ పెట్టి, ఆయన కాళ్లను చితకొట్టి.. వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందిన ఐపీఎస్ అధికారిని వీఆర్ లో పెట్టడం తప్పా..? గ్రూప్ 1 పరీక్షలో మెరిట్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గ ఐఏఎస్ ను వీఆర్ లో పెట్టడం తప్పా? .. మొగుడు పెళ్లాల కేసులో కూడా డబ్బుల కోసం ఎఫైఆర్ కట్టిన వ్యక్తిని వీఆర్ లో పెట్టడం తప్పా? మళ్ళీ సిగ్గులేకుండా “ఐఏఎస్, ఐపీఎస్ ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి’’ అంటూ జగన్ సొంత కర పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు. అటువంటి అధికారులను వీఆర్ లో పెట్టడం ఆటవిక దాడా సాక్షి చైర్ పర్సన్ గారు?
జగన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 151 సీట్లలో మధ్యలో 5 ఎగిరిపోయి 11 కు పడిపోయాడు. అయినా దెయ్యాలు వేదాలు వళ్ళించినట్టుగా సాక్షిపేపర్, టీవీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుచేసిన అధికారులనే వీఆర్ లో పెడతారు. అది ప్రభుత్వ పాలనా విధానం. వారి ఉద్యోగ ధర్మాన్ని చట్టబద్ధంగా ఎప్పుడు నిర్వహిస్తారని భావించినప్పుడు.. పై అధికారులు వారిని వీఆర్ నుండి తీసి రెగ్యులర్ డ్యూటీ ఇస్తారు. చంద్రబాబు కాబట్టి వారిని వీఆర్ తో వదిలిపెట్టారు.. లేదంటే వారందరిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. వైసీపీ పాలనలో 170 అడిషనల్ ఎస్సీ, డీఎస్పీ, సీఐలను ఏళ్ళ తరబడి వీఆర్ లో ఉంచారు.. అప్పుడు ఈ స్వర్ణజిత్ సేన్, రామకృష్ణారావులు నోరెత్తలేదేం? మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి… వారిని వీఆర్ లో పెట్టడం సబబనే అని నేను నిరూపిస్తా.
సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో వీఆర్ లో పెట్టిన అధికారులపై ఉదాసీనతతో ఉన్నారు. జగన్ దుర్మార్గపు దురాగాతాలకు బలైన ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు. 2023 నుండి ముద్దాడ రవిచంద్రకు ఎన్నికలైయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వలేదు… అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఐఏఎస్ శ్రీనివాస్, నరేష్ కు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం అరాచకం కాదా?, ఐఏస్ రామజౌళిని 14 నెలలు వెయిటింగ్ లో పెట్టి చివరి ఏడు రోజులు పోస్టింగ్ ఇచ్చి యూపికి పంపలేదా? A2ను కలిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర ఐఏఎస్ కు పోస్టింగ్ కు రాలేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? జగన్ కు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకుంటే తప్ప ఐఏఎస్ సాయి ప్రసాద్ కు పోస్టింగ్ రాలేదు. మీరు అప్పుడు నోరెందుకు ఎత్తలేదు సార్? బాలసుబ్రమణ్యం ఐపీఎస్, ఏబీ వెంకటేశ్వరరావులకు ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించడం అత్యంత దారుణం… ఆటవికం కాదా?
శ్రీనివాసరాజు, చెరుకూరి శ్రీధర్, సి.నాగరాణి, క్రిష్ణ కిశోర్, టీఏ త్రిపాఠి, ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్.వి. రాజశేఖర్ బాబు, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషన్ , రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ, గంటా సుబ్బారావుల లాంటి అధికారులను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపండం పై స్వర్ణజిత్ సేన్, రామకృష్ణరావు ఐఏఎస్ ల నోరు అప్పుడు ఎందుకు తెరవలేదు… ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ ను ఎందుకు వేనకేసుకొస్తున్నారు సార్?
నేడు కళంకిత అధికారులను వీఆర్ లో పెడితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఈ వీఆర్ లో ఉన్న అధికారుల్లో కొందరు బెంగుళూరు ఎందుకు వెళ్తున్నారు. బెంగుళూరు, హైదరబాద్, చెన్నై వెళ్ళడానికి డీజీపీ పర్మిషన్ తీసుకున్నారా? వీఆర్ లో ఉంటూ వారి విద్యుక్త ధర్మాన్ని విస్మరించిన వారిపై డీజీపి చర్యలు తీసుకోవాలి. సీఐడీలో మొగుడూ పెళ్లాల గొడవ రిజిస్టర్ చేస్తారా? ఎక్కడ కాసులు రాలితే అక్కడా రాలిపోతారా? వారిని వీఆర్ లో పెడితే తప్పా? సాక్షి పత్రిలో జాలిపడినట్టుగా వీఆర్ లో ఉన్న అధికారుల ఆత్మగౌరవంపై ఏ దాడి జరగలేదు. వీఆర్ లో ఉండటానికి ఈ అధికారులు అందరూ అర్హులే. టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెడితే యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూసిన అధికారులను వీఆర్ లో పెట్టడం తప్పా? గన్నవరంలో పార్టీ ఆఫీసు తగలబెడితే.. మా పార్టీ కార్యకర్తలపై తిరిగి కేసు పెట్టారు… అలాంటి వారిని వీఆర్ లో పెట్టడం తప్పా?
మా అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ లు వీఆర్ లో ఉన్న అధికారులపై దృష్టి పెడితే చాలా మంది అధికారులు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతారు. మళ్ళీ వీళ్ళు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలారా… సాక్షిలో వచ్చే వార్తలను నమ్మకండి… సాక్షి ఒక అబద్దాల పుట్ట. 15 వ ప్లేస్ లో ఉన్న వ్యక్తిని డీజీపీని చేస్తే అప్పుడు ఎందుకు మాట్లడలేదు ఈ పెద్దలు. నాడు జరిగే అక్రమాలను ఖండించని ఈ పెద్దలకు నేడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడది?