సత్తెనపల్లి అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని టిడ్కో గృహాలు, షాదీఖానా, పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌ లను పరిశీలించి, పెండిరగ్‌ పనులను ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలి అని అధికారులకు తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడే పనులను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పక్కన పెట్టేసి, ఐదు సంవత్సరాల కాలం వృధా చేశారు అని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెంటనే పెడిరగ్‌ ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.