ఈ సినిమాని ఎంత మంది చూశారు?
చూడకపోతే ఓ సారి చూడండి.
సినిమా అంటే ఐదు పాటలు, నాలుగు ఫైట్లే కాదు… కధ కూడా ముఖ్యమే. ఈమధ్య సోషల్ మీడియాలో క్రైం స్టోరీస్, స్పోర్ట్స్ స్టోరీస్ బేస్డ్ సినిమాలు చాలా వస్తున్నాయి… చూశాము.. చూస్తున్నాము కూడా.
కానీ రైటర్ సినిమాలో కొత్త కోణం ఉంది. ఉన్నతాధికారి చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి అల్లిన ఓ పధకం చివరకు అతని ప్రాణాలే పోయే స్ధాయికి ఎలా చేరిందన్నది కధనం. ఒకరికి మించి ఒకరు ఇందులో పాత్రధారులు జీవించారు.
దాదాపుగా సినిమా అంతా పోలీసు స్టేషన్ లోనే ఎక్కువ భాగం నడుస్తుంది. Very interesting movie. సినిమా నిర్మాణ తీరు అభినందనీయం. పాత్రలు, సహచర నటీనటులు అందరూ వారివారి పాత్రకు న్యాయమే చేశారు. తమిళ సినిమా ఇది. తెలుగు అనువాదం. ముఖ్యంగా పాత్రికేయులు, న్యాయవాదులు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఆ మధ్యన జైభీమ్ సినిమా తరహాలోనే ఈ చిత్ర కధనం సాగింది. ఓసారి చూడండి…
-సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల
సీనియర్ జర్నలిస్టు
గుంటూరు.