యాత్ర 2కి బడ్జెట్‌ బాస్‌ ఎవరు?

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాద యాత్ర మీద ఈ చిత్రం వచ్చి మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 రెఢీ అయింది. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ సపోర్టర్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరీ ఎక్కువగా రాజకీయాలు టచ్ చేయకుండా కేవలం కథ మొత్తం జగన్ మీదనే దర్శకుడు నడిపించారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. వైఎస్ మరణాంతరం రాష్ట్రంలో చాలా మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఈ ఓదార్పు యాత్రకి వ్యతిరేకత రావడంతో పాటు జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు కూడా తెరపైకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే యాత్ర 2 మూవీ కోసం నిర్మాత ఏకంగా 50 కోట్లు ఖర్చు చేసారంట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ తక్కువ అయిన రెమ్యునరేషన్ ల ద్వారానే ఎక్కువ మొత్తం ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సినిమాలో వైఎస్ జగన్ పాత్రని చేసిన తమిళ్ యాక్టర్ జీవాకి ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. అలాగే మమ్ముట్టికి 3 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇలా రెమ్యునరేషన్ ల రూపంలోనే 25 కోట్ల వరకు సినిమాకి ఖర్చయ్యిందంట. మిగిలిన మొత్తం సినిమా మీద పెట్టినట్లు సమాచారం. మహి వి రాఘవ మేకింగ్, కంటెంట్ నేరేషన్ లో మంచి ఎక్స్ పర్ట్. ఆ విషయాన్ని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. ఫిబ్రవరి 8న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈగల్ కి పోటీగా వస్తోన్న కూడా యాత్ర2 కోసం వెయిట్ చేసే ఆడియన్స్ మాత్రం ఉన్నారు. ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందనే దానిని బట్టి మహి వి రాఘవ చెప్పిన కంటెంట్ ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అయ్యిందో అంచనా వేయవచ్చు.

ఇంత బడ్జెట్‌ పెట్టి సినిమా తీయడం అవసరమా… అన్న అనుమానాలు మరో పక్క వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క ఎలక్షన్స్‌ మరో పక్క సినిమా రిలీజ్ అది కూడా ఇంత బడ్జెట్‌ ఇంతకీ దీని వెనకున్న బడ్జెట్‌ బాస్‌ ఎవరూ వైఎస్‌ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా…?ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. మరి సినిమా ఏ మేరకు హిట్‌ అవుతుంది. ఇంతకీ ఈ బడ్జెట్‌ వెనక ఉన్నది ఎవరు పైగా ఎలక్షన్స్‌ సమయంలో విడుదలవుతున్న నేపధ్యంలో ఈ చిత్రం ఎన్నో ఆలోచనలకు దారి తీస్తుంది.