ఏపీసిసి చీఫ్ గా షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను అపాయింట్ చేసింది ఏఐసీసీ. షర్మిలను అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే కాంగ్రెస్‌లో వైయస్సార్ టిడిపి ని విలీనం చేసిన షర్మిలకు కీలక బాధ్యత అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి.

 గత పీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా.. అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్‌. ఈ నిర్ణయం తక్షణమే ని అమల్లో్కి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.