Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, పలు పార్టీల జాతీయ స్థాయి నేతలు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ..
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతి ఔత్సాహిక ప్రజలను కలిగి ఉంది. దేశంలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు నిరంతరం అభివృద్ధి చెందాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను ప్రార్థిస్తున్నాను.

రాహుల్ గాంధీ ..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు.అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత, ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.

అమిత్ షా..
తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక సంస్కృతి వారసత్వంతో, భారతదేశ సాంస్కృతిక పటంలో తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుందని అన్నారు.

జేపీ నడ్డా..
తెలంగాణ ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, శక్తివంతమైన పండుగలకు నిలయం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ కాలం గడిచేకొద్దీ ప్రగతిలో కొత్త శిఖరాలను అదిరోహిస్తుందని అన్నారు.