అమరావతే శాశ్వత రాజధాని!

టీడీపీ కూటమి విజయంతో అమరావతి రాజధాని అంశంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై ఎన్నికల సమయంలో కూటమిలోని పార్టీలు కూడా పలుమార్లు ప్రకటనలు చేశాయి. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకున్న శాశ్వత రాజధాని పనులకు ఈసారి బాబు మోక్షం కలిగించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.