-చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు -తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు చిలకలూరిపేట: ఇప్పటికైనా ప్రజలపై నిందలు వేయడం, సాకులు మాని వైకాపా, జగన్ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. చంద్రబాబు వంటి అలుపెరుగని పోరాటయోధుడిని అవమానించి, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని ఇంకా గ్రహించలేకపోతే ఎలా అని చురకలు వేశారు. ఆయన […]
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లతోనే బీజేపీ గెలుపు
-చేవెళ్లలో కలిసికట్టుగా పనిచేశాం -ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వేవ్ చెవెళ్లలో వచ్చింది కాబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. అందరం కలిసి పనిచేయడం వల్ల గెలుపు సాధించాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి వేయడం వల్లే గెలుపు వచ్చిందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. […]
Read Moreముగిసిన ఎన్నికల కోడ్
-తక్షణమే ఉత్తర్వుల అమలు -సీఈవో ముకేష్‌కుమార్ మీనా అమరావతి, జూన్ 6: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యం లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు […]
Read Moreఎన్నికల తీరుపై జగన్ వద్ద నేతల అనుమానం
-పార్టీ ముద్రపడిన గ్రామాల్లోనూ ఓట్లు రాలేదు -ఈవీఎంలను పరిశీలించాల్సిన అవసరం ఉంది -కుట్రలు చేసినా 40 శాతం ఓటింగ్ వచ్చింది -పార్టీ పునర్వైభవం సాధిస్తుందని విశ్వాసం -రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై ఆందోళన -కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ సూచన -గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి అమరావతి: వైసీపీ అధినేత జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. […]
Read Moreహాస్టల్‌కు రెడ్డి పేరు..రెచ్చిపోయిన జనసైనికులు
కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు, కుండీల ధ్వంసం యజమానితో కాళ్లు పట్టించుకున్న వైనం గుంటూరు : హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానిపై జనసైనికులు దాడి చేసి కాళ్లు పట్టించుకున్న ఘటన గుంటూరు లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జనసైనికులు హాస్టల్ మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి […]
Read Moreజగన్ కు అమరావతి రైతుల ‘గాంధీగిరి
-మామిడిపళ్లు, స్వీట్లు ఇచ్చి ర్యాంగింగ్ చేసిన అమరావతి రైతులు -జగన్ ఇంటికి తరలివెళ్లిన అమరావతి మహిళలు -నిన్న ఎస్పీ జాషువాకు పూలు ఇచ్చి గాంధీగిరి ప్రకటించిన పట్టాభి -నేడు జగన్ ఇంటికి పండ్లు తీసుకువెళ్లి ర్యాంగింగ్ చేసిన అమరావతి మహిళలు -ఏపీలో పెరుగుతున్న ‘గాంధీగిరి’ ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యర్ధిని నేరుగా వారి పద్దతిలోనే ఢీ కొట్టడం ఒక యుద్ధం. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకోవడం ఒక పద్ధతి. కానీ […]
Read Moreటీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించండి ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులతో భయానక వాతావరణం ఏర్పడిరది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి ప్రభుత్వ, […]
Read Moreజగన్ ఓటమికి కారణాలివే!
30 సంక్షేమ స్కీములు రద్దు చేసినప్పటికీ, వైసీపీకి ఏమి ఆశించి ఓటు వేశారో ఆలోచించండి. మత మౌడ్యానికి గురికాకుండ ఇప్పటికైనా బుద్దిని ఉపయోగించండి. 1. ఆదిపత్య కులాల కార్పొరేషన్లకు 7వేల కోట్లు కేటాయించి, ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు కనీసం ఒక్క రూపాయి కేటాయించకపోవడం. 2. అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి క్రిమినల్స్ ను ప్రోత్సహించి నందుకే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. 3. దళితులపై జరిగిన భయంకరమైన హత్యలే వైసీపీ ఓటమికి […]
Read Moreఅకీరాని మోదీకి పరిచయం చేసిన పవన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై […]
Read Moreత్వరలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉద్యోగుల సమస్యలు
త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాం వెల్లడి టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులతో భేటీ హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు జి.చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం లతో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం, రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు గురువారం నాంపల్లి టీజేఎస్ కార్యా లయంలో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. […]
Read More