మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలయ్యే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అది కూడా జగన్ ను ఎప్పుడూ నీడలా వెంటాడే అక్రమాస్తుల కేసుతోనే మళ్లీ ఆ కష్టాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అ కేసులో ప్రతి శుక్రవారం ఎసిబి కేసుకు హాజరైన జగన్ గత ఎన్నికల్లో గెలిచి సిఎం అయ్యాక ఆ హోదా బాధ్యతల పేరుతో కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందారు. అయితే తాజా ఎన్నికల్లో హోర ఓటమి పాలై మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్ మరోవైపు వైసిపి కనీస సీట్లు రాకపోవడంతో ప్రతిపక్షనేత హోదా కూడా కోల్పోవడం మరో పెద్ద దెబ్బగా పరిణమించనుంది. అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై బయట ఉన్న జగన్ ఇటీవలివరకు సీఎంగా ఉండటంతో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపుని పొందగలిగారు. తాను సిఎం హోదాలో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌కు వస్తే ట్రాఫిక్ సమస్యలతో పాటు, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని, అలాగే ఎపి ఖజానాపై అదనపు భారం పడుతుందని ఇలాంటి కారణాలను జగన్ కోర్టుకు విన్నవించుకోవడం ద్వారా ఆ వెసులుబాటు పొందారు.అయితే ఇప్పుడు ఇక జగన్ అలా కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరేందుకు ఏ కారణం లేదు. కారణం ఇప్పుడాయన ముఖ్యమంత్రి కాదు గదా కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. సో తనకు వీలుకాదని చెప్పడానికి అంత పెద్ద కారణాలు కూడా జగన్ చూపే పరిస్థితి లేదు. దీంతో ఇక మీదట ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాక తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇక జగన్ మళ్లీ అందరు నిందితుల లాగే న్యాయస్థానంలో జడ్జీ ఎదుట వినమ్రంగా చేతులు కట్టుకొని తలవంచుకొని నిలబడాల్సిందే. దేవుడా…ఈ స్క్రిప్ట్ లో ట్విస్ట్ ఏంటీ ఇంత దారుణంగా వుంది?