ఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్?

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కు రంగం సిద్ధం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజు (గురువారం)తో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత అంటే జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులకు ఆదేశించింది. ఈ రోజుతో గడువు ముగియనుండగా ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారోననే భయంలో పిన్నెల్లి ఉన్నారు. పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి పరిసరాల్లో పోలీసు బలగాలు మొహరించారు. తప్పించుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాగైనా పారిపోయేందుకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు.