తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు.