2024 ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు వేదికగా మారాయి. అందులో మైనార్టీ ఎమ్మెల్యేల అంశం కూడా ఒకటి. ఈసారి ఏపీ అసెంబ్లీ లో ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్యేలు కనిపించనున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు టీడీపి నుంచి గెలిచినవారు కావడమే విశేషం. ఇటు కూటమి లోని జనసేన,బిజెపి నుంచి మైనార్టీలకు సీట్ లభించకపోవడం, అటు వైసీపీ నుంచి సీట్ దక్కించుకున్నవారెవరూ గెలవకపోవడం తో ఇక టీడీపి నుంచి గెలిచిన ఈ ముగ్గురే మైనార్టీ లందరి తరుపున శాసనసభలో ప్రాతినిధ్యం వహించనున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నసీర్ అహ్మద్, నంద్యాల నుంచి మహమ్మద్ ఫరూక్, మదనపల్లె నుంచి షాజహాన్ బాషా వీరు ముగ్గురే టీడీపి నుంచి గెలుపొందినవారు. అయితే ఇప్పుడు జరిగే కాబినెట్ కూర్పు లో ఒక మైనార్టీ నేతకు అవకాశం లభించడం ఖాయం గా కనిపిస్తోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. చూడాలి. సో… ఆ లక్కీ పర్సన్ ఎవరనే సస్పెన్స్ కొద్ది రోజుల్లోనే వీడిపోనుంది.