తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మొక్కలు చెల్లిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలసి కూటమిగా ఏర్పడి రాష్ట్రం అధికారం లోకి రానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆనందాలు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు గెలిస్తే కలియుగ దైవం గా పిలువబడే శ్రీ వేం స్వామి ముందు వెయ్యి కొబ్బరికాయలు కొడతామని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు మొక్కుకున్నారు..
ఈ నేపథ్యంలో చంద్రబాబు విజయం సాధించినందుకు తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు.