స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు : లోకేశ్

అమరావతి, మహానాడు: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీలకు రూ.35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ.8.82 కోట్లు, మిగతా స్కూళ్లకు రూ. 51.90 కోట్లు మంజూరు చేశారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, మంచినీటి కోసం ఈ నిధులు వాడాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.