విస్తుపోయిన ఐటీ అధికారులు
ఆగ్రాలో 14 ప్రాంతాల్లో సోదాలు
ఉత్తరప్రదేశ్ : చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు ఉత్తరప్రదేశ్ లో సోదాలు నిర్వహించారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో అధికారులు షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.