న్యూ ఢిల్లీ :అంతరిక్ష రంగ సాంకేతికత అభివృద్ధికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కి పైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్‌కు సాయం లభించనుంది. భారత్‌కు ప్రస్తుతం రోదసిలో 55 ఉపగ్రహాలున్నాయి.