లక్ష మంచినీటి బాటిళ్ళ అందజేత

– ప్రతిఒక్కరూ స్పందించాలని టీడీపీ నేత మోహనకృష్ణ పిలుపు

విజయవాడ, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుండే మోహనకృష్ణ… తన మన్నవ మోహన కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష మంచినీటి బాటిళ్ళను అందజేశారు.