టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు

-గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్

గుంటూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అయితే, చాలా మంది అరెస్ట్‌ చేయొద్దంటూ కోర్టుకు వెళ్ళారని తెలిపారు. మినహాయింపు పొందినవారిని త్వరలో విచారణకు పిలుస్తామని మీడియాకు తెలిపారు. పోలీస్ విచారణలో నందిగం సురేష్ సహకరించారు… సురేష్ చెప్పిన సమాధానాలు క్రాస్ చెక్ చేసుకుంటాం.. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు.