-పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులకు నిధుల విడుదల
-కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు
-బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ ,ఆగస్టు 22: బీసీ & ఈబిసి కళ్యాణ లక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించింది. మొదటి దశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది.పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మి కోసం మొత్తం 65,026 దరఖాస్తులు చేసుకోగా ఈ సంవత్సరం 2024-25 కి గాను ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చ్ 2024 వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మార్వో వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా ,ఆర్డీవో వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి..
పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు అయ్యాయి. మొదటి దశలో విడుదల అయిన 1225.43 కోట్లలో మొత్తం దరఖాస్తులు కోసం రూ .649 .86 కోట్లు డిమాండ్ ఉండగా సంక్షన్ అయిన దరఖాస్తుల కోసం రూ 240. 73 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా రూ 984.70 కోట్లు రిమైనింగ్ బడ్జెట్ ఉంది..
బడుగు బలహీన వర్గాలకు వారి ఆడ బిడ్డల పెళ్లిళ్ల సహాయం కోసం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,00,116 రూపాయలు సహాయం చేస్తుంది. ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 1225.43 కోట్లు మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు.