సాయంత్రం నుంచి దుకాణాలు మూసివేయాలి
అత్యవసరమైతేనే బయటకు రావాలి
ర్యాలీలు, మైకులకు అనుమతి లేదు
దేవాలయాల్లోనే హనుమజ్జయంతి జరుపుకోవాలి
పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్ సూచనలు
నరసరావుపేట: టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, దానికి గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్తెనపల్లి టౌన్ స్టేషన్ పరిధిలోని ఒక రౌడీషీట ర్ ఒక రాజకీయ పార్టీ ఆఫీసు వాచ్మెన్పై దాడి చేసి చేతులతో కొట్టి పార్టీ ఆఫీసు ను తగులపెడతానని బెదిరించాడని, అతడిపై కేసు పెట్టి జైలుకు పంపినట్లు వివరించారు. అవరమైతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎటువంటి ర్యాలీలు, మైకులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు పర్మిషన్ లేదని తెలిపారు. ప్రజలు గుడిలో మాత్రమే స్వామి వారికి పూజలు నిర్వహిం చుకోవాలని, దీనిని దృష్టిలో వుంచుకుని ప్రజలందరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం 5 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలను (షాపులు) మూసివేయాలని సూచించారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రజలు ఎక్కడా గుమికూడరాదని…అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. కావాల్సిన సరుకులను ఇతర వస్తువులను శనివారం సాయంత్రం కల్లా తీసుకుని బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి పోలీసు వారికి శాంతి భద్రత ల విషయంలో సహకరించాలని కోరారు.
ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా సహకరించాలి
గురజాల: గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో శుక్రవారం కేంద్ర బలగాలతో ఎస్పీ మల్లికాగార్గ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 1 నుంచి 5 వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రజలు సహకరించాలని సూచించారు. కౌం టింగ్ రోజు రోడ్‌షోలు, బాణసంచా కాల్చడం నిషేధించామని ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా పల్నా డు గౌరవాన్ని నిలబెడదామని పిలుపునిచ్చారు. బైండోవర్ కేసులు, రౌడీషీట్లు ఉన్న వాళ్లు, లోకల్ రాజకీయ నాయకులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.