-గోదాముల్లో సరుకుకు గ్లోబల్ టెండర్లు
-రూ.1600 చొప్పున కాంగ్రెస్ అమ్మేసుకుంది
-రెండురోజుల్లో ఈడీ, సీబీఐకు ఫిర్యాదు
-బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి క్వింటాకు రూ.1600కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందని, ఈ మొత్తం వ్యవహారంలో రూ.1450 కోట్ల కుంభకోణం జరిగిందని వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో ఈడికి, సీబీఐకి దర్యాప్తు జరపాలని కోరుతూ ఫిర్యాదు చేయను న్నామని వెల్లడిరచారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఆర్‌ఆర్-రేవంత్ రాహుల్ ట్యాక్స్‌ను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిది స్కీమ్‌ల పాలన కాదు, స్కాంల పాలన అని ఆరో పించారు. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కమీషన్ కింద డబ్బులు ఇస్తుం ది…ఇచ్చిన డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయో ఆధారాలు ఉన్నాయన్నారు. అవినీతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో బీజేపీ నాయకులు చేతులు కలిపారని అందుకే వాళ్లు ఏం మాట్లాడటం లేదని విమర్శించారు. మా హయంలో వడ్లను ఎక్స్‌పోర్ట్ చేస్తే…రేవంత్ హయాంలో అవినీతి కరెన్సీని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఎక్స్ పోర్ట్ చేస్తుండని ధ్వజమెత్తారు.
రిమోట్ వారి చేతుల్లో ఉంది…
చంద్రబాబు నాయుడు, భీమవరం అల్లుడు దగ్గరే సీఎం రేవంత్‌రెడ్డి రిమోట్ ఉందని విమర్శించారు. వేల కోట్ల అక్రమంగా సంపాదించుకున్న కోడిగుడ్ల రం జిత్ రెడ్డిని జాయిన్ చేసుకుని టికెట్ ఇచ్చారు..విశ్వాసఘాతకులు రంజిత్ రెడ్డి, కడియం శ్రీహరి అని ఫైర్ అయ్యారు.