– ఓకే చేసిన ప్రపంచ బ్యాంకు
అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముంది.