Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రానికి 15000 కోట్లు మంజూరు హర్షణీయం

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యులు 

విజయవాడ , మహానాడు:  రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఏర్పరిచి మోడీచే శంకుస్థాపన జరిపించారన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో  నడుపుతున్న తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి అమరావతి రాజధాని లేదని మూడు ముక్కలుగా చేసి రాజధాని లేని రాష్ట్రంగా అభివృద్ధి శూన్యంగా చేశారన్నారు. వైయస్ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేసి కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. కూటమికి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నాంది పలకడం ఆనందకర పరిణామాలని పేర్కొన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ పెండ్యాల సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండటం గొప్ప పరిణామమన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి సహకారం అందిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్పన నందిరాజు, కొమరగిరి వాచస్పతి, ఆర్ బి ఎస్ నాయకుడు రాజ హనుమంతరావు నందిరాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.