కొలతేసి కధను ఎంచుకుని కమర్షియల్ ఫార్ములాను ఖచ్చితంగా సినిమాలో పెట్టి గురి తప్పని అకర్షణ దర్శకత్వ ప్రతిభతో తగ్గేదే లేదు అని తెలుగు సినీ పరిశ్రమలో మేటి దర్శకునిగా నిలిచిన సుకుమార్ 2004 మే 7న సినీ పరిశ్రమలోకి వచ్చి న లెక్కల మాస్టర్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్న సుకుమార్ సినిమాలు తీయడం మాత్రమే కాదు ట్యాలెంట్, ప్యాషన్, కష్టపడే తత్త్వం ఉన్న చాలా మందికి సపోర్ట్ చేయడానికి నిర్మాతగా మారారు.
అల్లు అర్జున్ హీరోగా, అను మెహతా హీరోయిన్ గా, శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్.. పలువురు ముఖ్య పాత్రలతో ఆర్య సినిమా తెరకెక్కినది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతంతో లైఫ్ టైం గుర్తుండిపోయే పాటలు ఇచ్చాడు. ఇప్పటికి ఫీల్ మై లవ్ అంటూ ఆర్య సాంగ్స్ పాడుకుంటూనే ఉంటాము. ఆర్య సినిమాకు నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. 7 మే 2004లో ఆర్య సినిమా రిలీజయింది. సుకుమార్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. క్యూట్ లవ్ స్టోరీలతో లవ్ లో పడేలా చేయగలరు. లాజిక్ సినిమాలతో వావ్ అనిపించగలరు. మాస్ కమర్షియల్ సినిమాలతో అదరగొట్టేసాడు అనిపించగలరు. లెక్కలు, ఫిజిక్స్ చెప్తూ మాస్టర్ లా ఎంతోమంది స్టూడెంట్స్ ని లైన్లో పెట్టిన సుక్కు మాస్టర్ డైరెక్టర్ గా మారి ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. ‘ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్ ని కొత్తగా పరిచయం చేసి జనాలకు ఒక కొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూపించి ఫీల్ మై లవ్ అనేలా చేసాడు. యూత్ అంతా సుకుమార్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయారు, ఆర్యతో అల్లు అర్జున్ స్టార్ అయిపోయాడు. ‘జగడం’ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా ఆ టేకింగ్ కి రాజమౌళి సైతం ఆశ్చర్యపోయి అభినందించారు. ఎంతోమంది యూత్ కి జగడం లో రామ్ క్యారెక్టర్ నచ్చింది. ‘ఆర్య 2’ అంటూ మరో కొత్త లవ్ స్టోరీని ఫీల్ అయ్యేలా చేసాడు. ఇక ‘100 % లవ్’ అంటూ ప్రేక్షకులకు తన వంద శాతం ప్రేమను ఇచ్చాడు. ‘1 నేనొక్కడ్నే’ అంటూ సరికొత్త ప్రయోగం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సుక్కు మాస్టర్. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఎన్టీఆర్ కి ఒక సరికొత్త లుక్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాక తన లాజిక్స్ తో సినిమాని అదరగొట్టేసారు. ప్రతి కొడుకు నాన్నకు ప్రేమతో అని పాడేలా చేసారు. ‘రంగస్థలం’ సినిమాతో ఒక్కసారిగా తనలోని మాస్ విశ్వరూపం చూపించారు. రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా రంగస్థలం నిలిచిపోయింది. సుకుమార్ ఇక మాస్ మొదలు పెట్టాడు పుష్ప’ సంభవం చూపించారు. పుష్ప అంటూ పాన్ ఇండియా మొత్తం తగ్గేదేలే అనిపించారు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేసారు సుకుమార్. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో సాధించలేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ సాధించారంటే ఆయనతో ఆ రేంజ్ లో సుకుమార్ యాక్టింగ్ చేయించారు. త్వరలో పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే లవ్ స్టోరీల్లో సరికొత్తవి చూపించేసారు. ఇక మాస్ కమర్షియాలిటీలో అందర్నీ మించిపోయారు. మరి రాబోయే రామ్ చరణ్ సినిమాతో ఇంకే రేంజ్ లో కొత్త కథని చూపించి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి. ఇక సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చాలా మంది ఇప్పుడు దర్శకులుగా మారి హిట్స్ కొడుతున్నారు. తన శిష్యుల సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మరీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే సుక్కు మాస్టర్ చాలా స్పెషల్.
====================================
శ్రీలీల స్టార్ తిరిగింది?
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ హీరోయిన్. కొద్దిరోజులుగా ఆమెకు ఎందుకోగాని అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై స్టార్స్ గా వెలగటం మొదలవుతుంది. అందుకు ఉదాహరణగా శ్రీలీల ను చెప్పచ్చు. ఆమె నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది అంటూంటారు దర్శక,నిర్మాతలు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రిలీజ్‌కు ముందు హైప్ తెచ్చిన పాటలు.. రిలీజ్ తర్వాత శ్రీలీల అందాల ఆరబోతకు యూత్ థియేటర్‌లకు బాగా నే వెళ్లారు. కేవలం శ్రీలీల గురించే ఈ సినిమా ఆడిందంటే అతిశయోక్తి కాదు. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరస సినిమాలు చేసింది. లాస్ట్ ఇయిర్ ‘ధమాకా’ సినిమా కూడా అంతే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో కొత్తదనం ఏమి లేకపోయినా రవితేజ కామెడీ, శ్రీలీల గ్లామర్ షోతో లాగేసింది.
అలాగే ‘ధమాకా’లో పర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్ శ్రీలీల పాత్రకు అంతగా స్కోప్ లేదు. దాంతో నటనకు పెద్దగా పని చెప్పే అవసరం రాలేదు. కానీ ఉన్నంతలో బాగానే దుమ్ము రేపింది. ముఖ్యంగా శ్రీలీల తన డ్యాన్స్‌లతో అదరగొట్టింది. రవితేజ పర్‌ఫార్మెన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా డాన్స్‌తో రెచ్చిపోయింది. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెకే దక్కుతుంది. రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించాలని మేకర్స్ భావించారు. ఇదే విషయమై శ్రీలీలను సంప్రదించి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రస్తుతం సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్ చేయడం శ్రీలీలకు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్ చేయనని శ్రీలీల చెప్పేసిందట. గతంలో పుష్ప 2 సినిమాలోనూ ఐటెం సాంగ్ కోసం అడిగితే రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.