24 శాతం హెచ్ఆర్ఏ మరో ఏడాది పొడిగింపు

అమరావతి, మహానాడు :  రాష్ట్ర విభజన వల్ల హైదరాబాదులోని సచివాలయం, శాఖధిపతుల కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో ఆర్థికపరమైన నష్టం కలగకూడదని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం 24 శాతం హెచ్ఆర్ఏను సచివాలయం, శాఖధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల గడువు 2024 జూన్ నాటికి ముగియడంతో వాటిని పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం 24 శాతం మరో ఏడాది పొడిగిస్తూ జీఓ నెంబర్ 72 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, శాకాధిపతుల కార్యాలయాలకు 24 శాతం హెచ్ఆర్ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.