4వ రోజు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

-ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న మండల వెంకటరమణారావు అదృశ్యమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో నాలుగవ రోజు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

అందులో భాగంగా ఈరోజు 2 NDRF బృందాలు, 3 SDRF బృందాలు కలిపి మొత్తం 50 మంది సిబ్బందితో 5 బొట్ల సహాయంతో, మరియు కేసరపల్లి నుండి హనుమాన్ జంక్షన్ పెరికీడు వంతెన వరకు గన్నవరం కేసరపల్లి వరకు ప్రవహించే నది ప్రవాహం వరకు, దానితోపాటు బుడమేరు వాగు పరిధి కలిపి గాలింపు చేపట్టారు. నదిలో పలుచోట్ల గుర్రపుడెక్క అధికంగా ఉండడంతో, గాలింపు చర్యలు ఆలస్యం కాకుండా ఉండటానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం తో గుర్రపు డెక్క ను తొలగించి వెతుకులాట ప్రారంభించారు. వీటితోపాటు పశ్చిమగోదావరి జిల్లా నుండి మూడు డ్రోన్ కెమెరాలు, కృష్ణాజిల్లా నుండి మూడు డ్రోన్ కెమెరాలు మొత్తం 6 డ్రోన్ కెమెరాలతో ఏలూరు కాలువ పరిసర ప్రాంతాలన్నీటిని గాలిస్తున్నారు.

దీనితోపాటు ఎంపీడీవో ఫోన్ యొక్క GPRS , IPDR (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్) సమాచారాన్ని క్షణక్షణం సేకరిస్తూ తాను మాట్లాడిన ఫోన్ కాల్ సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. అంతేకాక ఇంకా వేరే ప్రదేశాల్లో ఎక్కడైనా సంచరించి ఉంటాడేమో అనే కోణంలో కూడా విచారణను ముమ్మరం చేశారు.

ఆయన యొక్క ఫోన్ సిగ్నల్ లాస్ట్ అడ్రస్ ఎక్కడైతే ముగిసిందో అనగా ఏలూరు కెనాల్ కు అనుసంధానం కలిగిన అన్ని అప్రోచ్ రోడ్స్ లో గల సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నారు. విజయవాడ సిటీ లో గల సీసీ కెమెరాలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సిసి కెమెరాలు లేని ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజల వద్ద నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఇవే కాకుండా మధురానగర్ నుండి తదుపరి ఉన్న బస్టాండ్, రైల్వే స్టేషన్స్ అన్నిచోట్ల గాలిస్తూ అన్ని రూట్లలో ఉన్న అనుసంధాన సీసీ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో అనువణువునా గాలిస్తున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి