-మహబూబాబాద్‌లో సాధన సమితి
-పీఎం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యం
తెలంగాణ, మహానాడు: మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ ప్రమాద ఘటన ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాలు రాసేందుకు నాంది పలికింది. అప్పటికే రద్దీగా ఉన్న జనరల్ బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లికూతుళ్లు కిందపడడంతో కూతురు చనిపోగా, తల్లి కడుపులోని పిండం కూడా చనిపోయింది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న డాక్టర్ అశోక్ పరికిపండ్లను కలచి వేసింది. ఈ ఘటనతో చలించిపోయిన ఆయన ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 5 సాధార ణ బోగీలు అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. 5 సాధారణ బోగీల సాధన సమితిని ఏర్పాటు చేసిన డాక్టర్ అశోక్ ప్రయాణికుల ఇబ్బందులను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పు డో 20 ఏళ్ల క్రితం ఎక్స్‌ప్రెస్ రైలుకు 2 సాధారణ బోగీలనే విధానాన్ని తొలగించి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనరల్ కోచ్‌లను పెంచాలని సామాజిక కార్య క్రమాన్ని కొనసాగిస్తున్నారు.