– ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడి
కశ్మీర్: భారత్లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్టు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. ముష్కరులను అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.