ఛత్తీస్‌గఢ్ : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 50 మందికి పైగా భక్తులు మృతిచెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్‌శంకర్ తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, నలుగురు బద్రీనాథ్, 23 మంది కేదార్‌నాథ్‌లో మరణించారని వివరించారు. 50 ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసినట్లు వివరించారు.