బీజేపీ నేత, న్యాయవాది మహేందర్‌రెడ్డి మానవత్వం
స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదుల అభినందన
కరీంనగర్: ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసరమైన స్థితిలో అత్యంత అరుదైన ‘‘ఓ’’ నెగటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేస్తూ ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కరీంనగర్ బార్ అసోసి యేషన్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది, బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేంద ర్‌రెడ్డి. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన పంజాల జలజ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరమైంది. దాంతో బీజేపీ అనుబంధ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడవెల్లి శశిధర్ రెడ్డిని సంప్రదించగా ఆయన మహేందర్‌కు చెప్పారు. వెంటనే వెళ్లి కరీంనగర్ బ్లడ్ బ్యాంకులో ఓ నెగెటివ్ గ్రూప్ రక్తాన్ని దానం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 62 సార్లు రక్తాన్ని దానం చేయడం జరిగిందని, ప్రాణాలు నిలబెట్టడం కన్నా అంతకుమించిన సం తోషం ఏముంటుందని తెలిపారు. మహేందర్‌రెడ్డిని బార్ అసోసియేషన్ న్యాయ వాదులు, బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందిస్తున్నారు.