పొన్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు
పాడి కౌశిక్‌రెడ్డి దుష్ప్రచారం సిగ్గుచేటు
ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఉద్యమ నాయకుడిపై ఉద్యమ ద్రోహి అక్కసు
రవాణా మంత్రిగా ఆయన సేవలు అద్వితీయం
ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్
హైదరాబాద్: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియా సమవేశంలో కౌశిక్‌రెడ్డి ఆరోపణలను ఖండిరచారు. ప్లైయాష్ తరలిం చి రోజుకు 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లారీ డ్రైవర్లు వారి కాల కృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు పక్కన లారీలను నిలుపగా డ్రైవర్లపై దౌర్జన్యం చేస్తూ లారీల్లో అక్రమ రవాణా జరుగుతుందని బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో కౌశిక్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు.
నికార్సైన ఉద్యమ నాయకుడిపై ఒక ఉద్యమ ద్రోహి ఇలాంటి ఆరోపణలు చేయడం, అక్కసు వెలిబుచ్చడం సిగ్గుచేటని పేర్కొన్నారు. లారీలో బూడిద ఎన్ని టన్నులు పడుతుందో అవగాహన లేకుండా మాట్లాడు తున్నారని 32 టన్నుల వాహనంలో 70 టన్నుల బూడిద తరలిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. 32 టన్నుల లారీలో 32 టన్నుల బూడిద కూడా పట్టదని తెలుసుకోవాలని, 70 టన్నులు పడుతుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. పొన్నంకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కౌశిక్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో సందమల్ల బాబు, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, దుబాసి బాబు, జంగా అనిల్ కుమార్, దాసరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.