-పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్
-యువనేత నారా లోకేష్ కు పుట్టపర్తి లో అపూర్వ స్వాగతం
-మలివిడత శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న యువనేత నారా లోకేష్
-లోకేష్‍కు అపూర్వ స్వాగతం పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
-సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో నారా లోకేశ్ పూజలు
-ఆలయం వద్ద యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
-యువనేతకు ఆశీర్వచనాలు అందించిన వేదపండితులు
-మలివిడత శంఖారావం విజయవంతం కావాలని ఆకాంక్షించిన నారా లోకేశ్
-హిందూపురం పట్టణ వీధుల్లో బాణాసంచా కాల్చి సందడి చేసిన టీడీపీ కార్యకర్తలు
-హిందూపురం వాల్మీకి సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యువనేత లోకేశ్
-యువనేత లోకేశ్‌కు నీరాజనాలు పట్టిన వాల్మీకి సామాజిక వర్గీయులు, మహిళలు.
ఉండవల్లి : మంగళగిరి నియోజకవర్గంలో వరుస వలసలతో వైసీపీ తుడిచిపెట్టుకుపోతోంది. ముఖ్యనేతలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా వైసీపీకి ఘులక్ ఇస్తున్నారు. ఉండవల్లి నివాసంలో తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకులు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, కళ్లం గోవిందరెడ్డి ఆధ్వర్యంలో దొంతిరెడ్డి వెంకటరెడ్డి, రావుల శిరీషా రెడ్డి, సీపీఐ నాయకులు శ్రీనివాసరెడ్డి, మేకా వెంకటరెడ్డితో పాటు 25 రెడ్డి సామాజికవర్గ కుటుంబాలతో పాటు మరో 50 కుటుంబాలు వైసిపిని వీడాయి. వీరందరికీ యువనేత లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దొంతిరెడ్డి సాంబిరెడ్డి, కళ్లం గోవిందరెడ్డిలు వైసీపీలో కీలకమైన వ్యక్తులు. తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్ మండలంలో అన్ని సామాజికవర్గాలలో వీరి ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి నారా లోకేష్ తోనే సాధ్యమని గ్రహించి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సమస్యలు తీరుతాయని స్పష్టం చేశారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే ప్రజలు ఎన్నికల సమయంలో ఆలోచించి ఓటు వేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరిని రాష్ట్రంలో ఆదర్శంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికలయ్యాక పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తానని చెప్పారు. అభివృద్ధిని కాంక్షించే నేతలంతా తనతో కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో పెనుమాకకు చెందిన ముఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అలు వెంకటరెడ్డి, మేకా ధర్మారెడ్డి, గుదిబండ శ్రీనివాస్ రెడ్డి, మేకా హనుమారెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు తమ్మిశెట్టి జానకిదేవి, అమరా సుబ్బారావు, వల్లభనేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు